మా ఇల్లు ఎక్కడో పోయింది!!
మా ఇంట్లో కంచాలు, మంచి నీళ్ళు,వంట పాత్రలు ఒక్కోసారి అక్క పెట్టేది.. ఒక్కోసారి నేను పెట్టే దాన్ని!!
అక్క పెడితే తిన్న తరువాత నేను తీయాలి.. నేను పెడితే అక్క తీయాలి అనేది ఒప్పందం!!
మేము తీసేశాక మెతుకులు ఎత్తి, నీళ్ళు చల్లి తుడిచే బాధ్యత మాత్రం మా చెల్లిదే!!
అప్పట్లో ఈ కాస్త పనికే ముగ్గురం ముందు నువ్వు, ముందు నేను అని కొట్టుకు చచ్చే వాళ్ళం..జడలు ఊడిపోయేలా!!
మా డాడీ వచ్చి అరిస్తే తప్ప పనులు చేసేవాళ్ళం కాదు..
మరి ఇప్పుడో???
నోరు మూసుకుని ఎవరింట్లో వాళ్ళం అన్నీ పనులు కుయ్ కయ్ అనకుండా చేసుకుంటున్నాం..🥹🥹
మా నాన్న అరుపులు కూడా మేమే అరుస్తున్నాం అది వేరే విషయం అనుకోండి 🤣🤣🤣🤣🤣
Comments
Post a Comment