Posts

Hussain call

 #HusaainCall కొంచెం ఆలస్యంగా!! మొన్న పెళ్లి కూతురు కోసం మనం చేసిన సహాయం చూసి గురువారం ఒక హుస్సేన్ నాకు కాల్ చేశాడు.తనది కర్నూల్ అని, తాము ఐదుగురు అన్నదమ్ములం అని, బంగారం వ్యాపారం చేస్తామని,తమ తల్లి గారు చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం ఐదుగురికి ధనసహాయం చేస్తానని చెప్పుకొచ్చాడు.తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాడు.నా నెంబర్ ఎవరిచ్చారు అడగడంతో ఇక్కడే మెహదీపట్నంలో ఉండే ఇమామ్ ఇచ్చాడు అని చెప్పాడు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ముస్లింలు కానీ, స్త్రీలు కానీ, వికలాంగులు కానీ ఆర్ధిక సహాయం కోసం చూస్తుంటే నాకు చెప్పండి అన్నాడు.స్వతహాగా నేను వీళ్ళకి దూరంగా ఉంటానని నా సంగతి తెలిసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వెంటనే నేను ఓన్లీ ముస్లింలకు మాత్రమే సహాయం చేస్తారా అనడగడంతో అటు నుంచి "లేదు.. లేదు సహాయం చేస్తానికి అలా చూడకూడదు మేడం. ఎవరికైనా చేస్తాము" అన్నాడు. నాకు ఎవరూ తెలియదు, మీరు సహాయం చేస్తారని కూడా తెలియదు.ఎవరైనా ఉంటే చెప్తాలెండి అన్నాను. అతను కొంచెం ఆత్రం గొంతుతో "వెంటనే చెప్పండి మేడం, సాయంత్రానికి చెప్పేయండి.. నేను ఐదుగురిని చూసుకోవాలి సహాయం చేయడానికి" అన్నాడు. సాయంత్రం ...

మా ఇల్లు ఎక్కడో పోయింది!!

 మా ఇంట్లో కంచాలు, మంచి నీళ్ళు,వంట పాత్రలు ఒక్కోసారి అక్క పెట్టేది.. ఒక్కోసారి నేను పెట్టే దాన్ని!! అక్క పెడితే తిన్న తరువాత నేను తీయాలి.. నేను పెడితే అక్క తీయాలి అనేది ఒప్పందం!! మేము తీసేశాక మెతుకులు ఎత్తి, నీళ్ళు చల్లి తుడిచే బాధ్యత మాత్రం మా చెల్లిదే!! అప్పట్లో ఈ కాస్త పనికే ముగ్గురం ముందు నువ్వు, ముందు నేను అని కొట్టుకు చచ్చే వాళ్ళం..జడలు ఊడిపోయేలా!! మా డాడీ వచ్చి అరిస్తే తప్ప పనులు చేసేవాళ్ళం కాదు.. మరి ఇప్పుడో??? నోరు మూసుకుని ఎవరింట్లో వాళ్ళం అన్నీ పనులు కుయ్ కయ్ అనకుండా చేసుకుంటున్నాం..🥹🥹 మా నాన్న అరుపులు కూడా మేమే అరుస్తున్నాం అది వేరే విషయం అనుకోండి 🤣🤣🤣🤣🤣

గంగా తీరంలో ఏ ఘాట్ లలో స్నానం చేయాలి??

 గంగోత్రి లో గోముఖం నుంచి చుక్క చుక్కగా వస్తూ అలకనందగా ఉధృతిగా ప్రవహిస్తూ వారణాసి,ప్రయాగ త్రివేణీ సంగమం వరకు గంగమ్మ నృత్యం ఓ అద్భుతమైన ప్రవాహం.ఎన్నో చోట్ల ప్రవహించే గంగా నది కాశీలో మాత్రం అత్యంత పవిత్రమైన నదిగా మన శాస్త్రాలు చెబుతున్నాయి.అన్ని నదులకన్నా ఈ గంగానది మాత్రమే ఎందుకు ప్రత్యేకం అని ఎందరో శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన ఫలితాలు విడుదల చేశారు. సైన్స్ ప్రకారం ఒక మైక్రోబయాలజిస్టుగా చెబుతున్న ఈ విషయాలు నా సొంత వ్యాఖ్యలు కావు.నిజం నిరూపించిన, శాస్త్రీయ ఆధారాలు ఉన్న పరిశోధన ఫలితాలు ఇవి.. సాధారణంగా నీరు కలుషితం అవడానికి కారణం నీటిలో పెరిగే బ్యాక్టీరియా అని మనందరికీ తెలుసు.అయితే రెండు రోజులు మన నీళ్ళ సీసాలో,బిందెలో నిలువ ఉంచిన నీరు పాచిపోవడం మనం చూస్తూనే ఉంటాం.రకరకాల ఫిల్టర్లు, ఆర్ ఓ లు వాడుతూ మనల్ని మనం ఆ నీటి బ్యాక్టీరియా నుంచి తప్పించుకుంటూ ఉంటాం. ఇలాంటి బ్యాక్టీరియా చాలా సహజంగా మన నదుల్లో, చెరువుల్లో, బావుల్లో కూడా ఉంటుంది. అయితే జీవ నదుల్లో ఈ బ్యాక్టీరియా శాతం కొంచెం తక్కువ ఉంటుంది.కానీ వాటి ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటుంది.అందుకే పుష్కరాలకో,తీర్థాలకో వెళ్ళి ...

కాశీ ప్రయాణం ఎలా చేయాలి!!(రెండో భాగం)

 మొదటి భాగంలో కాశీలో ఆటోలో దర్శనీయ స్థలాల గురించి చెప్పాను కదా!! ఈ రోజు కాలినడకన చూడవలసిన దర్శనీయ స్థలాల గురించి చెప్తాను. కాలినడకనా?? హమ్మో.. మేము నడవలేము అనుకోకండి.. అన్నీ అక్కడ అక్కడే పక్కనే ఉంటాయి. ఒక రకంగా మహా అయితే అన్నీ కలిపి 2 కిలోమీటర్లు కూడా ఉండవు.కాకపోతే కాశీ అంటేనే ఇరుకు సందులకు పెట్టింది పేరు కాబట్టి ఏ రిక్షా రాదు. ఆ ఇరుకు సందుల్లోనే వ్యాపారస్తులు ద్విచక్ర వాహనాల రాకపోకలు కూడా ఉంటాయి.మనమే కాస్త చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి!! ఈ 12 ఆలయాలు కూడా కాలభైరవుడి ఆలయం సందర్శించిన తరువాత మాత్రమే వెళ్ళాలి.. లేదంటే పుణ్యం మన ఖాతాలోకి రాదు!! ఆ ఆలయాలు విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి ఆలయం(శక్తి పీఠం), గంగా స్నానాల ఘాట్ (వీటి వివరాలు ఇంకా ఉన్నాయి),డుండి గణపతి, సాక్షి గణపతి, చింతామణి గణపతి, గౌరీ కేదారేశ్వరుడు, వారాహి మాత ఆలయం , తిలా భండేశ్వరుడు, బృహస్పతి ఆలయం,బడే హనుమాన్ ఆలయం.. ఇవన్నీ ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది.. అన్నపూర్ణ ఆలయంలో పురోహితులు దక్షిణ ఇస్తానని చెప్పి అమ్మవారి అంతరాలయం దాకా వెళ్లిపోవచ్చు.. లేదంటే మామూలు దర్శనం కూడా చేసుకోవచ్చు!! కాశీ విశాలాక్షి అమ్మవారి ద...

కాశీ ప్రయాణం ఎలా చేయాలి!! (మొదటి భాగం)

 మొదటి సారి కాశీ క్షేత్రంలో అడుగు పెట్టాలి అని ఆలోచన రావడమే మన పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి.శివుడు అణువణువునా నింపుకున్న మహాక్షేత్రం కాశీ.మహాశివుని మొదటి భక్తుడైన శ్రీ మహావిష్ణువు హృదయం కాశీ.సమస్త దేవతలు నడయాడే పుణ్య క్షేత్రం కాశీ.గంగా తీర్థం ప్రవహించే పుణ్య దేశం కాశీ. తీర్థము+ క్షేత్రము కలిసి యుగయుగాలుగా నిలిచి ఉన్న మహిమాన్వితమైన పుణ్య తీర్థం కాశీ.. ఇక్కడికి చేరుకోవడం కేవలం కాలభైరవుని అనుమతి ఉంటేనే సాధ్యం అవుతుంది అనేది కాదనలేని సత్యం. ఈ క్షేత్రంలో పుట్టడం ఎంత అదృష్టమో, ఇదే క్షేత్రంలో చనిపోవడం కూడా అంతే అదృష్టం ‌అని వేద వాక్కు!! ఇది వరకు ప్రభుత్వాలే మలి దశలో ఉన్న వృద్ధులకు భోజన వసతి సౌకర్యాలు కలిపించి, వారు కాలం చేస్తే గంగా నదిలో ప్రత్యేకంగా నియమించిన పడవల్లో వారి అంతిమ సంస్కారాలు చేసే కర్త వచ్చేవరకు ఉంచేవారు. ఆ తర్వాత్తర్వాత కాలానుగుణంగా ఈ పద్ధతి మార్చి కర్త వచ్చేవరకు ఫ్రీజర్/కూల్ బాక్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు కానీ వృద్ధుల కోసం ఉన్న సౌకర్యాన్ని మాత్రం అనేక కారణాల రీత్యా తొలగించారు.ప్రభుత్వేతర సేవలు మాత్రం చాలా ఉన్నాయి.చిన్న చిన్న గదులు అద్దెకు ఇచ్చి అక్కడి ప్రజలు కూడా ఎంతో కొ...

మా కాశీ మజిలీ కథ (2)

 (ఇప్పుడు అసలు కథ) టికెట్లు బుక్ అయ్యాయి..ఒక తీరం దొరికింది అనుకున్నాము!! ప్రయాణం దగ్గర పడే కొద్దీ నా ఆరోగ్యం,మా నాని ఆరోగ్యం కుంటు పడుతూనే ఉన్నాయి.ఒకటే ఆయాసం, మందులు వేసుకునేందుకు కూడా ఓపిక లేనంత నీరసం.తినలేము,తాగలేము,లేవలేము. ఒకానొక దశలో ఇహ అడుగు వేయలేను అనేంత దుఃఖం. స్వామి ఎందుకో పరీక్షిస్తున్నాడు.అసలు మనల్ని కాశీ రానిస్తాడో లేదో,ఏ పాపం చేసామో అనే బాధ ఎక్కువ అయిపోయింది. ఏ బాధ కలిగినా ముందు నోటి వెంట, మనసులో అప్రయత్నంగా వచ్చే మాట, ఆలోచన అమ్మే కదా!! అందుకే నా బాధంతా అమ్మకి చెప్పుకున్నా.. కాశీలో అడుగు పెట్టాలి అంటే కాలభైరవుడి అనుమతి ఉండిల్సిందే.ఆయన ఆజ్ఞ,దయ లేకుండా కాశీ పరిసర ప్రాంతాల్లో కూడా కాలు పెట్టలేము. ప్రతి రోజూ కాలభైరవాష్టకం వినడమో, ఓపిక ఉంటే చదవడమో చేయమని మా అమ్మ చెప్పింది. ఇక అదే నాకు సముచితం అనిపించి రోజూ వింటూ, వీలున్నంత పారాయణ చేసుకున్నా..  ప్రయాణం చేయాల్సిన తేదీ రానేవచ్చింది. లగేజీ ముగ్గురికి ఆరు బ్యాగులు అయింది. అలాగే మందులు వేసుకుని ఇక్కడి నుండి వందే భారత్ నాగ్ పూర్ వరకు ఎక్కాం.ఎక్కాక కాస్త టీ/కాఫీ ఉంటే గానీ మా వారికి ప్రయాణం చేసినట్టు ఉండదు.ఎప్పుడో రీల్స్ లో రై...

మా కాశీ మజిలీ కథ..(1)

 "విశ్వనాథునికి దేవ దీపావళి మహోత్సవం" అని సంకల్పం జరిగిన నాటి నుండి మనసులో ఒకటే అలజడి. ఎప్పుడెప్పుడు ఆ కాశీ విశ్వనాథుని ముందు వాలతానా అని.. అనుకున్నదే తడవుగా టికెట్ల కోసం వేట ప్రారంభించాం.వెయిటింగ్ లిస్ట్ ఉన్నా బుక్ చేశాము.కానీ అవి ఒక్క టికెట్ కూడా ముందుకు కదలడం లేదు.సరే మన ప్రయాణం 10 నవంబరు తర్వాత కదా, 6 నవంబర్ వరకు సమయం ఉంది కదా అని వేచి చూడాల్సిందే అని నిర్ణయించుకున్నాం. కానీ దేవ దీపావళి మహోత్సవానికి లక్ష పైన దీపాలు వెలిగించాలనే సంకల్పం, నా ఒక్కదాని వల్లా అవుతుందా అనే అనుమానం అనుక్షణం వెంటాడుతూ ఉన్న రోజులు వచ్చాయి.. హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళ వరకు ఈ సంబరం గురించి తెలియజేశాము. ఈ పని మీద ఒకటికి రెండు సార్లు ఆ ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. చాలా మంది ఫేస్బుక్, వాట్సాప్,ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మాధ్యమాల నుంచి ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని దేవ దీపావళి నిమిత్తం పెట్టిన అసంఖ్యాక దీపారాధన కోసం తమ శక్తి కొలది గోత్రనామాల మీద పైకం పంపారు.. ఇప్పుడు బాధ్యత మరింత పెరిగింది అని అర్థం అయింది.. కానీ టికెట్ల సంగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది.టెన్షన్ భరించలేక మా కారులోనే వెళ్ళి వచ్చేద...